తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : శ్రీవారి బ్రహ్మోత్సవాలు - గరుడ వాహనంపై ఊరేగుతున్న తిరుమలేశుడు - TIRUMALA GARUDA VAHANA SEVA LIVE

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2024, 6:33 PM IST

Updated : Oct 8, 2024, 10:46 PM IST

Tirumala Brahmotsavam Garuda Vahana Seva Live : తిరుమలేశుడి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ సేవ వైభవంగా జరుగుతోంది. గరుడ సేవకు భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీకి తగ్గట్లుగా 12వందల మంది పోలీస్‌ సిబ్బందిని అదనంగా నియమించారు. ఇప్పటివరకు పెద్దశేష, చిన్న శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై విహరించిన వేంకటేశుడు ఇప్పుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. మూలవర్లకు అలంకరించే లక్ష్మీకాసులహారం, మకరకంఠి ఆభరణాలను మలయప్పస్వామికి అలంకరించారు. తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుంచి తెప్పించిన గోదాదేవి మాలలనూ ప్రత్యేకంగా అలంకరించారు. గరుడసేవను వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చారు. టీటీడీ తిరుమాఢ వీధుల్లోని గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చునే అవకాశం కల్పించింది. మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తుల తరలివచ్చారు. ప్రస్తుతం స్వామివారి గరుడవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.
Last Updated : Oct 8, 2024, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details