ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చిట్టడవిని తలపిస్తున్న టిడ్కో ఇళ్లు - పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్న లబ్ధిదారులు - TIDCO HOUSES IN VUYYURU - TIDCO HOUSES IN VUYYURU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2024, 1:25 PM IST

Bad Condition of TIDCO Houses in Vuyyuru: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకం టిడ్కో లబ్దిదారులకు శాపంగా మారింది. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు పట్టణ పరిధిలో మూడు ప్రాంతాల్లో గత టీడీపీ ప్రభుత్వం 2500కు పైగా టిడ్కో గృహాలు మంజూరు చేయగా దాదాపు 80 శాతం నిర్మాణాలు అప్పుడే పూర్తయ్యాయి. 2019లో అధికారం లోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా గాలికి వదిలేసింది. అందువలన లబ్దిదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 

దీంతో టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాంతం పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తోంది. వీటికి కేవలం రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తే సరిపోతుంది. వైఎస్సార్సీపీ సర్కార్ ఈ ఇళ్లను గాలికి వదిలేసింది. టిడ్కో ఇళ్ల వైపు ఎవరూ రాకుండా ఇళ్ల నిర్మాణం ప్రాంతం చుట్టూ గత ప్రభుత్వం ఫెన్సింగ్ వేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల్లో నమ్మకం కలిగింది. ప్రభుత్వం ఇళ్లను త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని లబ్దిదారులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details