ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కువైట్‌ అగ్నిప్రమాదం - రాష్ట్రానికి చెందిన ముగ్గురి మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు - AP People in Kuwait fire - AP PEOPLE IN KUWAIT FIRE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 3:25 PM IST

Three Dead Bodies of AP Were Brought to Their Native Villages in Kuwait Fire : కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన రాష్ట్రానికి చెందిన ముగ్గురి మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. అగ్ని ప్రమాదంలో తూర్పుగోదావరికి జిల్లాకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు చనిపోయారు. ఈ ముగ్గురి మృతదేహాలను మొదట విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. మృతదేహాలకు బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్వగ్రామాలకు తరలించారు.

అయితే కువైట్ లోని ఆల్ మంగాఫ్​లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం భారత్​కు చేరుకున్నాయి. భారత వాయుసేన (IAF) కు చెందిన ప్రత్యేక విమానం మృతదేహాలతో తొలుత కొచ్చిన్ విమానాశ్రయానికి చేరుకుంది. అధేవిధంగా దుర్మరణం పాలైన భారత కార్మికుల కుటుంబాలకు రూ.8 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కువైట్​కు చెందిన ఎన్బీటీసీ సంస్థ ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున అందిస్తామని వెల్లడించింది. 

ABOUT THE AUTHOR

...view details