శామీర్‌పేటలో దొంగల బీభత్సం - 48 తులాల బంగారం, 80 కిలోల వెండి చోరీ - Jewellery Shop Robbery In Medchal - JEWELLERY SHOP ROBBERY IN MEDCHAL
Published : Aug 7, 2024, 3:11 PM IST
Jewellery Shop Robbery In Shamirpet : మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూముకుంటలో బుధవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగల దుకాణంలోంచి భారీ ఎత్తున బంగారం, వెండి అభరణాలను ఎత్తుకెళ్లారు. ఘటనా దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఇదీ జరిగింది : శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూముకుంటలో జగదీశ్ అనే వ్యక్తి బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. అతడి కుమారుడు గణేశ్ మంగళవారం రాత్రి ఎప్పటిలాగే దుకాణానికి తాళం వేసి వెళ్లాడు. రాజీవ్ రహదారి పక్కన ఉన్న కృష్ణ జ్యువెలరీ షాప్ షట్టర్ పైకెత్తి లోపలికి వెళ్లి అందులో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. దుండగులు దుకాణంలో 48 తులాల బంగారం, సుమారు 80 కిలోల వెండి ఆభరణాలను అపహరించినట్లు షాప్ యజమాని తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని బాలానగర్ డీసీపీ సురేశ్, మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డిలు పరిశీలించి షాపు యజమానితో మాట్లాడారు. చోరీ చేసిన అనంతరం దుండగులు అభరణాలు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురు దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని మేడ్చల్ అదనపు డీసీపీ నర్సింహారెడ్డి తెలిపారు.