LIVE : శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ - legislative council Live - LEGISLATIVE COUNCIL LIVE
Published : Jul 27, 2024, 10:03 AM IST
|Updated : Jul 27, 2024, 8:43 PM IST
Legislative Council On Budget Live : తెలంగాణ శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాల్లో బడ్జెట్‌పై వాడివేడి చర్చ జరగనుంది. అనంతరం పద్దుపై ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు. మొదటి రోజు సభలో ప్రశ్నోత్తరాలు, కొన్ని టేబుల్ అంశాలపై సభలో చర్చించారు. అలాగే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ మృతిపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాప తీర్మానం చదివి వినిపించారు. రెండో రోజు తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అంతకుముందు మంత్రిమండలి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగం, సంక్షేమం, అభివృద్ధికి అధిక మొత్తం నిధులు కేటాయించారు. కాగా ఇవాళ శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చా కార్యక్రమం ఉండనుంది. 28 ,29, 30 తేదీల్లో సమావేశాలకు సెలవు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.
Last Updated : Jul 27, 2024, 8:43 PM IST