తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : సర్వాయి పాపన్న జయంతోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు - Sarvai Papanna Goud Jayanthi live - SARVAI PAPANNA GOUD JAYANTHI LIVE

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 12:10 PM IST

Updated : Aug 18, 2024, 12:25 PM IST

Sarvai Papanna Goud Jayanthi in Telangana Live : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్​ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను, పాపన్న జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలను పాపన్న ఏకం చేశారని భట్టి అన్నారు. ఆయన పోరాడిన తీరు గొప్పదని అన్నారు.పాపన్న స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ మనందరికీ స్ఫూర్తి ప్రదాతన్న అన్న ఆయన నిజాం అరాచకాలను ఎదిరించిన సామాన్య వ్యక్తి సర్వాయిపాపన్న అన్నారు. శివాజీ హిందు సామ్రాజ్యం కోసం మొగల్​ చక్రవర్తులపై ఎలా పోరాటం చేశారో సర్వాయిపాపన్న కూడా అలానే పోరాటం చేశారని తెలిపారు.
Last Updated : Aug 18, 2024, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details