LIVE : కేబినెట్ మీటింగ్ వివరాలను వెల్లడిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - TELANGANA MINISTERS LIVE
Published : Jan 4, 2025, 9:04 PM IST
|Updated : Jan 4, 2025, 9:22 PM IST
Telangana Ministers Press Meet : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 30నే కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినందున వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో శనివారం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులపై భేటీలో చర్చించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా రూ.12 వేలు సాయం అందించాలని కూడా మంత్రి మండలి నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. కేబినెట్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : Jan 4, 2025, 9:22 PM IST