LIVE : తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - LEGISLATIVE COUNCIL LIVE
Published : Dec 18, 2024, 10:04 AM IST
|Updated : Dec 18, 2024, 8:04 PM IST
Telangana Legislative Council session 2024 Live : తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు బుధవారం నాలుగో రోజు కొనసాగనున్నాయి. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ "భూ భారతి'' బిల్లు ప్రవేశ పెట్టనుంది. ఆర్వోఆర్ చట్టం 2024ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు రెండు సభల్లోనూ సమాధానాలు ఇస్తారు. ఆ తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 'తెలంగాణ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమువల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్' సవరణ బిల్లు ప్రవేశ పెడతారు. అనంతరం శాసనసభలో గురుకుల, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనమండలిలో ఇవాళ క్రీడా బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. అదేవిధంగా కౌన్సిల్‌లో పర్యాటక విధానంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.
Last Updated : Dec 18, 2024, 8:04 PM IST