తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - tg formation day 2024 live - TG FORMATION DAY 2024 LIVE

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 9:17 AM IST

Updated : Jun 2, 2024, 11:27 AM IST

Telangana Formation Day 2024 Live : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను సీఎం రేవంత్​ రెడ్డి జాతికి అంకితం చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తోంది. ఉదయం నుంచే పరేడ్​ గ్రౌండ్స్​లో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి గన్​పార్కు వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళి అర్పించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​కు వెళ్లారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి ఓపెన్​ టాప్​ జీపులో పరేడ్​ పర్యవేక్షించారు. ఆ తర్వాత జయ జయహే తెలంగాణ 2.30 నిమిషాల గీతాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించారు. సాయంత్రం ట్యాంక్​ బండ్​పై ముగింపు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. తెలంగాణ హస్తకళలు, ఫుడ్​ స్టాల్స్​ను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో దశాబ్ది వేడుకలను చూడడానికి ట్యాంక్​ బండ్​కు వచ్చారు.
Last Updated : Jun 2, 2024, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details