Live : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియా సమావేశం - EC Vikas Raj Live - EC VIKAS RAJ LIVE
Published : Apr 18, 2024, 5:27 PM IST
|Updated : Apr 18, 2024, 5:52 PM IST
EC Live : రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల సమరంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంటులో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియ నేటి నుంచి ఈనెల 25 వరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ నిర్వహించి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్లతో పాటు కంటోన్మెంట్ ఓట్ల లెక్కింపు కూడా జూన్ 4న జరగనుంది. అఫిడవిట్ అసంపూర్తిగా ఉంటే ఆ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసు ఇస్తారు. నామినేషను వేసినప్పటి నుంచి అభ్యర్థుల ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రధాన ఆధికారి వికాస్‌రాజ్ వివరిస్తున్నారు.
Last Updated : Apr 18, 2024, 5:52 PM IST