తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : మండలిలో బడ్జెట్​ ప్రవేశపెడుతున్న శ్రీధర్​ బాబు - ప్రత్యక్షప్రసారం - తెలంగాణ ఓట్​ ఆన్ బడ్జెట్ 2024

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 12:05 PM IST

Updated : Feb 10, 2024, 1:19 PM IST

Telangana Legislative Council Sessions 2024 : అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు మండలిలో బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదే తరహాలో రాష్ట్రంలోనూ ప్రవేశపెడుతున్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో ప్రజాకర్షకంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్ అయినప్పటికీ ఏడాదికి సరిపడా ప్రతిపాదనలు ఉండనున్నాయి. అయితే పూర్తి బడ్జెట్ తరహాలో సమగ్ర వివరాలు ఉండవు. ఆయా శాఖల పద్దులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఉండవు. దీంతో పద్దులపై చర్చకు అవకాశం ఉండదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ సమయంలో అన్ని అంశాలను మరింత సమగ్రంగా బేరీజు వేసుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

Last Updated : Feb 10, 2024, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details