తెలంగాణ

telangana

ETV Bharat / videos

టార్గెట్​ రీచ్​ కాకపోతే పదవులు ఊడతాయ్ - పార్టీ సభ్యత్వంపై బీజేపీ శ్రేణులకు వార్నింగ్​ - Abhay Patil Warning to BJP Cadre - ABHAY PATIL WARNING TO BJP CADRE

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 6:53 PM IST

BJP Membership Registration Incharge Abhay Patil Warning to BJP Cadre : సభ్యత్వ నమోదు చేయకుండా వాళ్ల శిష్యుడిని, వీళ్ల శిష్యుడిని అని కబుర్లు చెప్పొద్దని రాష్ట్ర బీజేపీ సభ్యత్వ నమోదు ఇంఛార్జి అభయ్ పాటిల్ శ్రేణులను హెచ్చరించారు. మనమంతా పార్టీ, మోదీ శిష్యులమేనన్నారు. కార్యకర్త నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరికీ సభ్యత్వ లక్ష్యం పెట్టామని గుర్తుచేశారు. 'నేను ఐదుసార్లు ఎమ్మెల్యేను, ఆరు సార్లు ఎమ్మెల్యేను, నేను సభ్యత్వాలు నమోదు చేయాలా?' అనే కబుర్లు చెప్పొద్దని హెచ్చరించారు. బర్కత్​పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యత్వ నమోదుపై వర్క్​షాప్​ నిర్వహించారు.

ఈ సమావేశానికి అభయ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎవరు ఎంత మంది సభ్యత్వాలు చేశారన్నదే తనకు ముఖ్యం అన్నారు. పది రోజుల్లో ఇచ్చిన టార్గెట్​లో 50 శాతం పూర్తిచేయకుంటే మీ పదవులు పోతాయని హెచ్చరించారు. పదవి ఇచ్చింది పార్టీకి పనిచేయడానికి అన్నారు. అంతేకాని విజిటింగ్ కార్డుల్లో పార్టీ పదవి ప్రింట్ చేసుకుని పైరవీలు చేస్తూ తిరగొద్దని సూచించారు. ప్రతి జోన్​లో తమకు ఇచ్చిన టార్గెట్ కంటే ఒక సభ్యత్వం ఎక్కువగానే చేయాలని మార్గ నిర్దేశం చేశారు. ఈ పది రోజులు ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున పార్టీకి పనిచేస్తే టార్గెట్​ను రీచ్ అవ్వొచ్చన్నారు. వినాయక నిమజ్జనం రోజు కూడా సమయం వృథా చేయొద్దని, ఉదయం పనిచేసి సాయంత్రం నిమజ్జనం చేసుకోవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details