LIVE : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - Telangana Assembly Sessions live - TELANGANA ASSEMBLY SESSIONS LIVE
Published : Jul 23, 2024, 11:05 AM IST
|Updated : Jul 23, 2024, 11:51 AM IST
Telangana Assembly Sessions 2024 Live : రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం సుమారు 7-10 రోజుల పాటు నిర్వహించనున్నారు. ముందుగా సభలో సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నారు. అనంతరం శాసనసభ వాయిదా పడనుంది. శాసనసభ ముగిసిన అనంతరం బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ సమావేశాన్ని స్పీకర్ సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలు, ఎజెండా బీఎస్సీలో ఖరారు చేయనున్నారు. ఈనెల 25న ఉదయం 9 గంటలకు సీఎం అధ్యక్షతను క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 25న అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ శాసనసభ సమావేశాల్లోనే జాబ్ గ్యారంటీపై ప్రకటన, పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉంది.
Last Updated : Jul 23, 2024, 11:51 AM IST