తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణ శాసనసభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 10:06 AM IST

Updated : Feb 15, 2024, 8:51 PM IST

Telangana Assembly Session 2024 Live : తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం నాడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రేవంత్‌రెడ్డి తాను ముఖ్యమంత్రిననే విషయాన్ని మరిచిపోయి, హుందాతనం పక్కనబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆరోపించారు. సీఎం అయ్యాకైనా ఆయన భాషలో మార్పు వస్తుందని ఆశించామని కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అనుచిత, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా సీఎం, మంత్రులు, కాంగ్రెస్‌ శాసనసభ్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మైక్‌ అడగని కాంగ్రెస్‌ సభ్యులకు కూడా స్పీకర్‌ మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారని, తమను తిట్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నాయకుల బుద్ధి మారలేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రాకుండా పారిపోయారని వ్యాఖ్యానించారు. అధికారం నుంచి ప్రతిపక్షంలోకి మారినా సదురు నాయకులకు బుద్ధి మారలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. తాజాగా నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Last Updated : Feb 15, 2024, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details