LIVE: ముంబయిలో టీమిండియా క్రికెటర్ల రోడ్ షో - ప్రత్యక్ష ప్రసారం - Team India Cricketers Road Show - TEAM INDIA CRICKETERS ROAD SHOW
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 4, 2024, 5:34 PM IST
|Updated : Jul 4, 2024, 7:40 PM IST
Team India Cricketers Road Show in Mumbai: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియా 3 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈనెల 29న జరిగిన ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసిన రోహిత్ సేన గురువారం ఉదయం దిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు టీమ్ఇండియా ప్లేయర్లు బయల్దేరారు. ప్రధానితో భేటీ అయ్యాక టీమ్ఇండియా స్పెషల్ ఫ్లైట్‌లో ముంబయికి చేరుకుంది. ప్రస్తుతం ఆటగాళ్లంతా భారీ రోడ్ షోలో పాల్గొన్నారు.ఈ క్రమంలో రోడ్ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్ టాప్ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్ షోలో పాల్గొన్నారు. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగుస్తుంది. ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2 కిలోమీటర్లు ఉండనుంది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓపెన్ టాప్ బస్సులో ముంబయిలో టీమిండియా క్రికెటర్ల రోడ్ షో ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jul 4, 2024, 7:40 PM IST