ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కళ్లకు గంతలు కట్టుకుని ఉపాధ్యాయుల నిరసన - జగన్​కు ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరిక - సీపీఎస్ రద్దు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 12:25 PM IST

Teachers Protest : ఉపాధ్యాయుల సమస్యలను విస్మరించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమని ఖండించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉపాధ్యాయుల ఆందోళనకు సిద్ధమవుతుండగా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధం, 41 నోటీసులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ కడపలో యుటీఎఫ్ ఆధ్వర్యంలో మహావీర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

తాము దాచుకున్న సొమ్మును కూడా ముఖ్యమంత్రి వినియోగించుకున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు. గత రెండేళ్ల నుంచి పెండింగ్​లో ఉన్న 18 వేల కోట్ల ఆర్థిక బకాయిలను తక్షణ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకపోగా ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలను అక్రమ అరెస్టులను చేయడం దారుణమని ఖండించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌ స్పందించకపోతే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details