ఐదేళ్లలో వ్యవస్థలు, కార్పొరేషన్లను సర్వనాశనం చేశారు : నీలాయపాలెం విజయ్‌కుమార్ - Corruption under YSRCP rule - CORRUPTION UNDER YSRCP RULE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 7:40 PM IST
Neelayapalem vijay kumar fire on ysrcp : గడిచిన ఐదేళ్లలో వ్యవస్థలను, కార్పొరేషన్ లను సర్వనాశనం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. వైెస్సార్సీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. కంటెంట్ కార్పొరేషన్ గా ఉన్నదాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరు మార్చి దోచుకున్నారని దుయ్యబట్టారు. ఒక చిన్న కార్పొరేషన్ లో 129 మంది ఉద్యోగులను తీసుకొని లక్షల్లో జీతాలు చెల్లించారని, సగం మంది ఆఫీసుకు రాకున్నా జీతాలు చెల్లించారని మండిపడ్డారు.
ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఇళ్లలో ట్యూషన్ చెబుతున్న టీచర్లకు కార్పొరేషన్ నుంచీ జీతాలు చెల్లించారన్నారు. ప్రకటనల పేరుతో సాక్షి పేపర్ కు, ఐ ప్యాక్ కు కోట్లు కట్టబెట్టారన్నారు. ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడికి డిజిటల్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చి దోచిపెట్టారని ఆరోపించారు. దోపిడీపై ప్రశ్నించిన తనకు నోటీసులు ఇచ్చిన చిన్న వాసుదేవరెడ్డి నేడు ఎక్కడికి పారిపోయాడని నిలదీశారు. ఈ అక్రమ దోపిడీపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.