కడపలో విచ్చలవిడి గంజాయి అమ్మకాలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషానే కారణం : టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి - టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 7:49 PM IST
TDP Srinivasa Reddy on Deputy CM Amzath Basha: కడప నగరంలోని పాత బస్తీలో గంజాయి(Ganja) విక్రయాలు విచ్చలవిడిగా జరగడానికి మూల కారణం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా( Deputy CM Amzath Basha) అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి(TDP Polit Bureau Member Srinivasa Reddy) ఆరోపించారు. యువత గంజాయి మత్తులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ను ఉప ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని ఆరోపించారు. గంజాయి విక్రయాల్లో ఎవరైనా పట్టుబడితే వారిని అరగంటలోపే అంజాద్ బాషా విడిపించుకుని వెళ్తున్నారని మండిపడ్డారు.
కడప నగరంలో 32, 33, 34, 35 సీ డివిజన్లకు సంబంధించిన పార్టీ కార్యాలయాలను శ్రీనివాస్ రెడ్డి, కడప టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి(Kadapa TDP candidate Madhavi Reddy) ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కడప నగరంలోని పాత బస్తీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి మార్గాలు కల్పిస్తానని చెప్పారు. ఉపాధి మార్గాలులేక ఎంతో మంది యువత గల్ఫ్ దేశాల(Gulf countries)కు వెళ్తున్నారని, వారందరినీ తిరిగి రప్పించి వారికి ఉపాధి మార్గాలు కల్పిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన ఎంతోమంది నిరుద్యోగ యువత(Unemployed youth)కు ఉపాధి అవకాశాలు(Employment opportunities) కల్పిస్తామని చెప్పారు.