వైఎస్సార్సీపీ పాలనలో క్రీడారంగం నిర్వీర్యం- టీడీపీ అధికారంలోకి వస్తే మరింత ప్రోత్సాహం - Badminton in Mangalagiri
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 1:25 PM IST
TDP Organized Badminton Competitions in Mangalagiri Constituency : వైసీపీ ప్రభుత్వ పాలనలో క్రీడారంగం నిర్వీర్యమైందని టీడీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్యయకర్త నందం అబద్ధయ్య విమర్శించారు. మండలంలోని పెనుమాకలో నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. మార్చి 3 వరకు జరిగే పోటీల్లో 185 జట్లు పాల్గొంటాయని తెలిపారు. నారా లోకేశ్ యువతను ప్రోత్సహించడానికి నియోజకవర్గంలో అన్ని రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
బ్యాడ్మింటన్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. లక్ష, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.75000, మూడో స్థానం నిలిచిన జట్టుకు రూ.50000 అందజేస్తామని నందం అబద్ధయ్య వివరించారు. నారా లోకేశ్ టోర్నమెంట్‌కు కల్పించిన సదుపాయాలను చూసి క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి క్రీడాలను ప్రొత్సహించే విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం పగ్గాలు చేపట్టిన తరువాత క్రీడలు క్రిీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.