ఓటమి భయంతోనే జగన్ తన పార్టీ శ్రేణులను రెచ్చగొడుతున్నారు : ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి - Bhumireddy meeting with TDP agents - BHUMIREDDY MEETING WITH TDP AGENTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 5:51 PM IST
TDP MLC Meeting With Agents About Postal Ballot Counting : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై టీడీపీ ఏజెంట్లకు అవగాహన కల్పించామని ఆ పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా రేణిగుంటలోని వై కన్వన్షన్ హలులో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏజెంట్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రప్రజలకు మరి కొన్ని గంటల్లో నియంత పాలన నుంచి స్వాతంత్ర్యం రాబోతుందని తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ శ్రేణులను ముఖ్యమంత్రి జగన్, నాయకులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కౌంటింగ్ పక్రియకు విఘాతం కలిగించి ఎలాగైన గెలవాలని వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. దీనికి సజ్జల రామకృష్ణా రెడ్డి మాటాలే నిదర్శనమని తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్సార్సీపీ తాము చెప్పిందే నిబంధనలని ఎన్నికల సంఘాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. అందుకే పోస్టల్ బ్యాలెట్ లెక్కంపు విషయంలో పూర్తిస్ధాయిలో తెలుగుదేశం కార్యకర్తలకు శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళుతున్న టీడీపీ ఏజెంట్లను నిబంధనలకు అనుగుణంగా సమాయత్తం చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్బంగా ఈసీ సూచనలు పాటిస్తామని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 5 లోక్ సభ స్ధానాల పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.