ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో అక్రమాలు నిజమే - విచారణ జరిపిస్తాం: పయ్యావుల కేశవ్‌ - CBI Investigation on Group 1 Posts - CBI INVESTIGATION ON GROUP 1 POSTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 4:56 PM IST

TDP MLAs Demands CBI Investigation on Filling of Group 1 Posts : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల పేరిట 300 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని రాజమండ్రి  రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేవనెత్తారు. ఏపీపీఎస్సీని వైఎస్సార్సీపీ  నేతలతో నింపి గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, గ్రూపు-1 పోస్టుల భర్తీ విషయంలో రూ.300 కోట్లు అవినీతి జరిగిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మూల్యాంకనం విషయంలోనూ నిబంధనలు మార్చి తనకు అనుకూలమైన అభ్యర్ధులకు పోస్టులు కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని అన్నారు. 

ఆగస్టు 31 తరువాత చర్యలు తీసుకుంటాం : ప్రభుత్వం తరపున ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇస్తూ, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని ప్రకటించారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగింది నిజమేనని, దీనిపై కోర్టులో విచారణ జరుగుతోందని, గ్రూప్‌-1 అక్రమాలపై ప్రభుత్వం కూడా విచారణ కమిటి వేసిందని గుర్తు చేశారు. ఆగస్టు 31లోగా నివేదిక వస్తుందని, ఆ తర్వాత చర్యలు ఉంటాయని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details