ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్​సీపీ రౌడీలకు కడపలో ఆస్కారం లేదు- ఇక వీపులు విమానం మోతే: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి - MLA Madhavi Warning to YCP Leaders - MLA MADHAVI WARNING TO YCP LEADERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 5:29 PM IST

MLA Madhavi Warning to YCP Leaders and Activists: కడప వైసీపీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. కొందరు ఇప్పటికీ గూండాలు, రౌడీలనే అహంకారంతో ఇళ్లు, దుకాణాల ముందు కుర్చీలు వేసుకుని కూర్చొని దాదాగిరీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మాధవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే వారి ఇళ్లల్లో కూర్చుని మాట్లాడుకోవాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. 

సంఘ వ్యతిరేక శక్తులకు కడపలో ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడానని ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పష్టం చేశారు. కడపలో గుండాలమని కాలర్ ఎగరేస్తే సహించేది లేదని అలాంటి వ్యక్తుల చేష్టలకు పుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. వారి ఆగడాలు ఇలానే కొనసాగితే మాత్రం వీపులు విమానం మోత మోగుతాయని మరోసారి వైఎస్సార్​సీపీ నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాధవీ రెడ్డి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details