తిరుపతి లోక్సభ, శాసనసభ సీట్లను గెలిచి కూటమికి కానుకగా అందిస్తాం: టీడీపీ నేతలు - TDP Leaders Meeting At Tirupati - TDP LEADERS MEETING AT TIRUPATI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 9:28 PM IST
TDP Leaders Meeting At Tirupati : సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్సభ, శాసనసభ సీట్లను గెలిచి కూటమి అధినేతలకు కానుకగా అందజేస్తామని తెలుగుదేశం నాయకులు తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. తిరుపతి లోక్సభ బీజేపీ అభ్యర్థి వర ప్రసాద్, శాసనసభ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల విజయం కోసం శ్రమిస్తామని తెలిపారు. తమ అధినేత చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ శ్రేణులు కూటమి అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటామని స్పష్టం చేశారు.
TDP BJP JanaSena Alliance : ఓటమి భయంతో వైసీపీ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ముఖ్యనాయకుల ఇళ్లల్లో మద్యాన్ని భారీఎత్తున డంప్ చేశారని ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈ డంప్లను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో వైసీపీ నేతల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. తిరుపతిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల కమీషన్ కేంద్ర బలగాలను నియమించాలని కోరారు.