'కౌంటింగ్లో ముగ్గురు అధికారులు వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది' - TDP Leaders Complaint to EC
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 1, 2024, 10:26 AM IST
TDP Leaders Complaint to Election Commission About Palnadu : పల్నాడు జిల్లాలో ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నేతలు ఎన్నికల సీఈఓ కి ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉంటూ వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించారని నేతలు ఫిర్యాదు చేశారు. జూన్ 4న కౌంటింగ్ లో ముగ్గురు అధికారులు వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున అధికారుల అండతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని సీఈఓకి (CEO) ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల వేల పల్నాడులో జరిగిన విద్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ రోజు తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరారు. కొందరు అధికారులు వైఎస్సార్సీపీతో చేతులు కలిపి దాడులుకు పురిగొల్పే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి సూచనలు ఇస్తూ, పలువురు అవినీతి అధికారుల పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.