జగన్ బటన్ నొక్కి విద్యార్థుల ఫీజులు చెల్లించలేదు: టీడీపీ నేత విజయ్ కుమార్ - Vijaykumar Tell School Fees Issue - VIJAYKUMAR TELL SCHOOL FEES ISSUE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 2:25 PM IST
TDP Leader Vijaykumar Media Conference on School Fees Issue : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా దాదాపు 3వేల 480 కోట్ల బకాయిలు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. పిల్లలపై పిడుగు పేరుతో సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించకుండా జగన్ మాయ మాటలు చెప్పారని ధ్వజమెత్తారు. 2023లో కట్టాల్సిన బకాయిలకు 2024లో బటన్ నొక్కి డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు.
తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశామని చెప్పి 9,64,000 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా జగన్ మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఫీజుల పేరుతో సాక్షిలో టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వం చూస్తోందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఫీజులన్నీ చెల్లిస్తామని సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వాలని మంత్రి లోకేశ్ మౌఖికంగా కాలేజీలకు తెలిపారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్క దిద్దుతూ దశల వారీగా ఫీజులు చెల్లిస్తామని విజయ కుమార్ తేల్చి చెప్పారు.