ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్ నిజాయతీ పరుడైతే కోర్టులో తను నిర్దోషిగా నిరూపించుకోవాలి : వర్ల రామయ్య - Varla Ramaiah Fire on YS Jagan - VARLA RAMAIAH FIRE ON YS JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 7:04 PM IST

TDP Leader Varla Ramaiah Fire on YS Jagan: రాష్ట్రంలో 31 రాజకీయ హత్యలు జరిగాయని అబద్దాలు చెప్పడం అవగాహన లేని మాటలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఆ హత్యలు ఎక్కడ జరిగాయో ధైర్యం ఉంటే పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఉన్నప్పుడు జగన్ ఇంత గగ్గోలు పెట్టలేదని నేడు ఏదైనా చేసి పోగొట్టుకున్న అధికారం పొందాలని జగన్ అతిగా ఆవేశపడుతున్నాడని మండిపడ్డారు. దిల్లీ వెళ్లి ఏదో చేయాలని చూసి అభాసు పాలయ్యాడని గుర్తు చేశారు. 

జగన్ తమ పాలనను గుర్తుచేసుకోండి.. 11 కేసుల్లో ఛార్జ్ సీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి తమరు అని ఎద్దేవా చేశారు. 43 వేల కోట్ల కొట్టాశారని సీబీఐ చెప్పిందని దుయ్యబట్టారు. అధికారం పోయి 50 రోజులు అయినా జగన్ మీద ఉన్న కేసులపై ఎందుకు కోర్టులకు హాజరు కావడంలేదని ప్రశ్నించారు. జగన్ నిజాయతీ పరుడైతే కోర్టులో తన నిర్థోషినని నిరూపించుకోవాలన్నారు. సామాన్యులు విచారణకు రాకుండా ఉంటే చట్టం ఊరుకుంటుందా అలాగే జగన్ రెడ్డి కేసులను న్యాయస్థానం సమీక్షించి చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య అన్నారు.

ABOUT THE AUTHOR

...view details