ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సోమిరెడ్డి - TDP somireddy counter to KTR - TDP SOMIREDDY COUNTER TO KTR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 9:25 PM IST

TDP Somireddy Chandramohan Reddy Counter to KTR: తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్​కు, కొడుకు కలెక్షన్ హౌస్​కు పరిమితమయ్యారని తెలంగాణ సోమిరెడ్డి ఘటుగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో తమ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారని మండిపడ్డారు. జగన్ లాంటి నియంత చేతిలో ఆంధ్రప్రదేశ్ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారని దుయ్యబట్టారు. అందుకే తెలంగాణ ప్రజలు మీకు ముందుగానే గుణపాఠం చెప్పారని తెలిపారు. తమ నాయకుడు చంద్రబాబుని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాగా ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఓడపోవడం ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details