ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'స్కూల్ బుక్స్‌ టెండర్‌లో రూ.120 కోట్ల స్కాం- ఓట్ల కొనుగోలుకు డబ్బులు పోగేసుకుంటున్న జగన్​' - పాఠ్యపుస్తకాల కుంభకోణం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 3:41 PM IST

Irregularities in purchase of textbooks: దోపిడీకి కాదేదీ అనర్హమంటూ అన్నింట్లోనూ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. ఆఖరికి సర్కార్ బడి పిల్లలకు ఇచ్చే పాఠ్యపుస్తకాల్లోనూ జగన్ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బుక్స్‌ టెండర్‌లో 120 కోట్ల రూపాయల స్కాం జరిగిందని ఆరోపించారు. 2022లో 4 ప్యాకేజీలుగా పాఠ్యపుస్తకాల టెండర్లు పిలిచారని, టన్ను పేపర్‌ ధర రూ.లక్ష ఉన్నప్పుడు పేజీ 23 పైసలకు టెండర్‌ పిలిచారని తెలిపారు. ప్రస్తుతం టన్ను పేపర్‌ ధర సుమారు రూ.85 వేలుగా ఉందని, టన్ను పేపర్‌ ధర 15 శాతం తగ్గినా 34 పైసలకు టెండర్‌ పిలుస్తున్నారని ఆరోపించారు. 

వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు డబ్బులు పోగేసుకుంటున్నారని పట్టాభిరామ్ ఆరోపించారు. వైఎస్సార్సీపీకి అభ్యర్థులు దొరక్క మంత్రి బొత్స కుటుంబానికి 5 టికెట్లు ఇచ్చారని పట్టాభి అన్నారు. ఎన్నికల ఖర్చు భరించలేమని బొత్స సీఎంకు మొరపెట్టుకుంటే బుక్స్ టెండర్‌లో దోచుకోమని జగనే సలహా ఇచ్చారని తెలిపారు. దోచుకోవడానికి మార్గాలుండగా ఐదు కాకపోతే పది సీట్లు ఇవ్వవచ్చు అని పట్టాభి ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details