ఇసుక కాంట్రాక్టులతో వేల కోట్లు దోచుకున్న వైఎస్సార్సీపీ నేతలు : పట్టాభి - sand
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 1:50 PM IST
TDP Leader Pattabhi on Sand Robbery of YCP Leaders: రాష్ట్రలో ఇసుక దోపిడీతో వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని తెలుగుదేశం నేత పట్టాభి (TDP Leader Pattabhi Ram Kommareddy) ఆరోపించారు. దోచుకోవడానికి ముందే కుమ్మక్కై ఒక కంపెనీకే టెండర్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. వేల కోట్ల విలువైన ఇసుక టెండర్‌ని కేవలం 1,528 కోట్లకే ఇచ్చారని మండిపడ్డారు. అంతకుముందు గనుల శాఖ రూ.2,610 కోట్ల విలువైన ఇసుకను అమ్మినట్లు (Illegal sand mining in AP) తెలిపిందని అన్నారు.
16 నెలల్లోనే రూ.1,940 కోట్ల విలువైన ఇసుకను అమ్మినట్లు గనులశాఖ చెప్పిందని అన్నారు. నెలకు సగటున రూ.110 కోట్ల ఆదాయం వచ్చే గనులను మరి వైసీపీ ప్రభుత్వం జేపీ పవర్ వెంచర్స్‌కు రెండేళ్ల కాలానికి రూ.1528 కోట్లకు ఎలా ఇచ్చారని పట్టాభి ప్రశ్నించారు. జరగబోయే ఎన్నికల్లో వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమేనని అప్పుడు ప్రత్యేకంగా విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టాభి అన్నారు.