ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాలంటీర్‌ వ్యవస్థను బలోపేతం చేస్తాం- రాజీనామా చేయని వారికి అండగా ఉంటాం : జేసీ - JC Prabhakar Reddy - JC PRABHAKAR REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 5:22 PM IST

TDP Leader JC Prabhakar Reddy Comment on Volunteers Resignation : వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయవద్దని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వాలంటీర్​ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రజల వద్దకే ప్రభుత్వ పరిపాలన అంటూ సీఎం జగన్​ మోహన్​ రెడ్డి వాలంటీర్​​ వ్యవస్థను తీసుకువచ్చిన ప్రజలకు న్యాయం చేయడంలో విఫలం అయ్యారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయకుండా మరింత బలోపేతంగా చేయడమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు.

వైసీపీ నాయకుల ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా వాలంటీర్లు రాజీనామా చేయవద్దని జేసీ ప్రభాకర్​ రెడ్డి సూచించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ప్రతి 50 ఇళ్లను పర్యవేక్షించే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత సేవలందించే ప్రణాళికను రూపొందించారని పేర్కొన్నారు. రాజీనామా చేయకుండా కొనసాగే వాలంటీర్లకు తాము అండగా ఉంటామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాలంటీర్లలకు సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details