ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తాగునీటి పైపులైన్‌ మరమ్మతులకు దిగిన జేసీ ప్రభాకర రెడ్డి- అడ్డుకున్న వైసీపీ శ్రేణుల - పెన్నా తాగునీటి పైపు లైను మరమ్మతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 7:54 PM IST

TDP Leader JC Prabhakar On Water Issue In Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెన్నానది సమీపంలో తెలుగుదేశం, వైఎస్సార్సీపీ (YSRCP) నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెన్నా నది ప్రాంతంలో తాగునీటి పైపు లైను మరమ్మతులను పరిశీలించడానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అతని అనుచరులతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడున్న కొందరు ఎమ్మెల్యే అనుచరులు జేసీ ప్రభాకర్ రెడ్డికి (JC Prabhakar Reddy) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు (Slogans) చేశారు. 

పోటాపోటీ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతలో పోలీసులు (Police) జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. తాము అభివృద్ధి చేయడానికి ఎప్పుడూ ముందుంటామన్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి వేసవిలో తాగునీటి (Drinking Water) కష్టాలు లేకుండా పైపులైన్‌ మరమ్మతులు చేయిస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్యను తొలగించడాని పైపులైన్​ మరమ్మతులు పరిశీలిస్తుంటే వైసీపీ నేతల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details