జగన్ తాడేపల్లి ప్యాలెస్ కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటిది: డొక్కా - Dokka Varaprasad on Jagan - DOKKA VARAPRASAD ON JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 3:42 PM IST
TDP Leader Dokka Manikya Varaprasad Allegations on Jagan: మాజీ సీఎం జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటిదని టీడీపీ నేత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శలు గుప్పించారు. కాంప్లెక్స్‌లో కమాండర్లా సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు, కుతంత్రాలకు ప్రణాళికలు రచించారని డొక్కా చెప్పారు. జగన్ కాంప్లెక్స్‌లో సుప్రీం లాంటివారని ఆయన అభివర్ణించారు. సుప్రీం కన్నా కనపడని శక్తి ప్యాలెస్‌లో ఉందని ఆశక్తి ఆదేశాలతోనే కుట్రలు, కుతంత్రాలు అమలవుతున్నాయని అన్నారు. రాజధానిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై కాంప్లెక్స్‌లో ఉండి సమాధానం ఇచ్చే కన్నా అసెంబ్లీకి వచ్చి సమాధానం చెబితే బాగుండేదన్నారు. ఐదు సంవత్సరాలు కాంప్లెక్స్ వీడని జగన్ రెండు గంటలసేపు ప్రెస్‌మీట్ పెట్టి ఎప్పటి లాగానే అబద్దాలను చెప్పారని డొక్కా ఆరోపించారు. ఐదేళ్లలో వైఎస్సార్సీపీ చేసిన ఘోరాలను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నామని డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు.