ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE ఓటమి భయంతోనే జగన్ రెడ్డి డ్రామా రాజకీయాలు - టీడీపీ నేత దేవినేని ఉమా మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - CM Jagan attack Live - CM JAGAN ATTACK LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 3:12 PM IST

Updated : Apr 14, 2024, 3:27 PM IST

TDP Leader Devineni Uma Press Meet on CM Jagan attack Live : ముఖ్యమంత్రి జగన్‌కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. జగన్‌ శనివారం రాత్రి విజయవాడలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రికి భారీ భద్రత ఉన్నప్పటికీ రాయి విసిరి, గాయం చేయగలిగారంటే భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోర వైఫల్యం చెందారనేది స్పష్టమవుతోంది.విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌నగర్‌లో గంగానమ్మ గుడి దగ్గర వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ వద్ద సీఎం జగన్‌ బస్సు యాత్ర సాగుతుండగా ఆయనపై రాయి పడింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. సీఎం పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్‌ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌కూ రాయి తగిలి స్వల్ప గాయమైనట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు.కృష్ణా జిల్లా కేసరపల్లిలో శనివారం రాత్రి యాత్ర ముగిసిన తర్వాత భారతీరెడ్డి అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు. సీఎం జగన్‌కు గాయం కావడంతో ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. దీనిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.
Last Updated : Apr 14, 2024, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details