జూన్ 4 తర్వాత జగన్ ఇంగ్లాండ్‌కు పరారే : దేవినేని ఉమ - Devineni Uma fires on cm jagan - DEVINENI UMA FIRES ON CM JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 6:00 PM IST
TDP Leader Devineni Uma Press Meet : రాష్ట్రంలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్ ఇంగ్లండ్‌కు పరారీ కావటం ఖాయమని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఓటమి తర్వాత విదేశాలకు పారిపోవడానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు అందరూ పాస్ పోర్టులు తీసుకుని సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఏపీ హేట్స్ జగన్ రెడ్డి అనేది ప్రజల నినాదంగా మారిందని విమర్శించారు. ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలు అన్ని జనం లేక వెలవెలబోతే, ప్రస్తుతం చేపడుతున్న బస్సు యాత్ర సైతం తుస్సు యాత్రగా మారిందన్నారు.
తాను ఫ్టస్ట్ క్లాస్ స్టూడెంట్ అని శాసనసభలో గొప్పలు చెప్పుకునే జగన్, అబద్దాలు చెప్పడంలో నిజంగానే ఫస్ట్ క్లాస్ స్టూడెంటేనని విమర్శించారు. అబద్దాల్లో జగన్ పీహెచ్‌డీ (PHD) తీసుకున్నారని దుయ్యబట్టారు. సొంత చెల్లెల్లే జగన్‌కు రాఖీ కట్టే పరిస్థితి లేదని విమర్శించారు. బాబాయ్‌ను చంపినోడికి ఎంపీ టికెట్ ఇవ్వడమే కాకుండా పక్కనే పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే చంద్రబాబు సీఎం కావడం ఖాయమని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.