ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్ రెడ్డి ఏపీని గంజాయికి రాజధానిగా మార్చేశారు: దీపక్ రెడ్డి - Deepak Reddy Fire on CM Jagan - DEEPAK REDDY FIRE ON CM JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 6:58 PM IST

TDP Leader Deepak Reddy Fire on CM Jagan : సీఎం జగన్ మోహన్ రెడ్డి శాండ్, లాండ్, వైన్, మైన్ దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. గత 5 ఏళ్లల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో కంటే 4 రెట్లు ఎక్కువగా అప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణతో సమస్యలు పెండింగ్ ఉన్నా సచివాలయం భవనంను కేసీఆర్​కు గిఫ్ట్​గా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఏపీని గంజాయికి రాజధానిగా మార్చేశారని నిప్పులు చెరిగారు. నార్కోటిక్స్ బ్యూరో ప్రకారం డ్రగ్స్​లో నెంబర్ 1 స్థానంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్షనేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసే సమయంలో తనకు మ్యానిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పారని దీపక్ రెడ్డి గుర్తు చేశారు. కానీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 85 శాతం కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఇలా ప్రజలను నమ్మించి మోసం చేయడం ఏంటని ప్రశ్నించారు. కేవలం ప్రజాధనం వృథా చేస్తూ టీడీపీ నేతలపై కక్ష రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే రాష్ట్రం అభివృద్ధి కాదని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details