ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

హైదరాబాద్​కు టీడీపీ అధినేత - మోదీని కలవనున్న చంద్రబాబు - cbn will go hyderabad

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 12:05 PM IST

TDP Leader Chandra Babu Will Meet Modi At Hyderabad: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈరోజు, రేపట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. రెండు రోజుల పర్యటనలో (tour) భాగంగా మోదీ ఈరోజు హైదరాబాద్‌ రానుండడంతో చంద్రబాబు కూడా ఈరోజు హైదరాబాద్​కు వెళ్లనున్నారు. ఇవాళ, రేపట్లో చంద్రబాబు మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తుకు (alliance) సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాలను చంద్రబాబు పలుమార్లు కలవగా మోదీని కలవడం ఇదే తొలిసారి. 

Alliance First Meeting in Chilakalooripet: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే సీట్లపై దాదాపు కొలిక్కి వచ్చిన వేళ, పార్టీల అధినేతలు ప్రచారంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ, జనసేన నిర్వహించే భారీ బహిరంగ సభకు ఈ నెల 17న మోదీ హాజరు కానున్నారు. నారా లోకేశ్ బహిరంగ సభ ప్రదేశానికి ఇటీవలే భూమి పూజ చేశారు. సభ ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details