ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

10రూపాయిలు ఇచ్చి 1000 రూపాయిలు కొట్టేసే ప్రభుత్వాన్ని గద్దె దించాలి- టీడీపీ నేత భూపేష్ రెడ్డి - TDP leader Bhupesh Reddy - TDP LEADER BHUPESH REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 5:24 PM IST

Tdp Leader Bhupesh Reddy on YSRCP Government: కడప జిల్లా పులివెందుల్లో టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి బీటెక్ రవి నామినేషన్ వేశారు. అనంతరం టీడీపీ నేత భూపేష్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి సొంత కార్యకర్తలకు కూడా అందుబాటులో లేని దయనీయ పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. పై జేబులో 10 రూపాయిలు పెట్టి కింది జేబులో నుంచి 1000 రూపాయిలు కొట్టేసే ప్రభుత్వాన్ని గద్దె దించాలని భూపేష్ రెడ్డి పేర్కొన్నారు.

1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1978లో వైయస్ కుటుంబం రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి పులివెందులలో స్వాతంత్రం కోల్పోయిందని బీటెక్ రవి అన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తామని బీటెక్ రవి పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. యువతకు ఉపాధి కల్పించటంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని భూపేష్ రెడ్డి మండిపడ్డారు. రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ అందుబాటులోకి వచ్చేలా ప్రజలు కృషి చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details