ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విజయవాడ పశ్చిమ టికెట్‌ నాకే ఇవ్వాలి - కచ్చితంగా గెలుస్తా: జలీల్‌ ఖాన్ - TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 7:15 PM IST

TDP Jaleel Khan Rally: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ సీటు జలీల్ ఖాన్​కే ఇవ్వాలంటూ ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ సీటు ఇవ్వడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని ముస్లిం సంఘాలు తెలిపాయి. ర్యాలీలో జలీల్ ఖాన్ పాల్గొన్నారు. మైనారిటీలు అందరూ తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారని, విజయవాడ పశ్చిమ సీటు తెలుగుదేశం గెలిచే సీటని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. 

ఇతర వర్గాలు ఎక్కడి నుంచైనా పోటీ‌ చేయవచ్చని, కానీ తనకు మాత్రం ఇదొక్కటే అవకాశమన్నారు. ముస్లింల సెంటిమెంట్​ను కూడా గుర్తించాలన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్​లను సైతం కలిసి సీటు కోరినట్లు జలీల్ ఖాన్ తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేశానన్నారు. తనకు సీటు ఇస్తే భారీ మెజారిటీతో తప్పకుండా గెలుస్తానన్నారు. వైసీపీలో ముస్లింలకు సీటు ఇచ్చారు కాబట్టి టీడీపీ కూడా ఇవ్వాలన్నారు. మెజారిటీ భాగం ముస్లింలు ఇక్కడ ఉన్నారని, తనకు తప్పకుండా సీటు ఇస్తారని, ఇవ్వాలని కోరుతున్నానన్నారు. 

ABOUT THE AUTHOR

...view details