వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ఎటువంటి లబ్ధి జరగలేదు: టీడీపీ ఇన్‌ఛార్జి కొండయ్య - మత్స్యకారుల సమస్యలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 1:17 PM IST
TDP Incharge Enquired was Fishermen Problems: మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు బాపట్ల జిల్లా చీరాల టీడీపీ ఇంఛార్జ్ ఎం.ఎం కొండయ్య వారితో కలిసి వాడరేవు సముద్రంలో ప్రయాణించారు. మత్స్యకారులతో సమావేశమై పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులు పడుతున్న కష్టాలు తెలియాలంటే స్వయంగా వారితో కలిసి సముద్రంలో ప్రయాణిస్తేనే తెలుస్తుందని కొండయ్య పడవల్లో వెళ్లారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ప్రాణహాని ఉన్న వృత్తిని ఎంచుకుని చాలీచాలని ఆదాయంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎటువంటి లబ్ధి జరగలేదని కొండయ్య విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మత్స్యకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మత్స్యకారుల జీవన శైలి గురించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకున్నదే లేదు. తుపాన్లు సంభవించినప్పుడు మత్స్యకారులకు ఉండటానికి టీడీపీ ఇచ్చిన గృహాలే తప్ప వైఎస్సార్సీపీ వీరికి ఏ విధమైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. టీడీపీ ప్రభుత్వం మరో రెండు నెలల్లో అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు మెరుగైన సదుపాయాలు అందించడానికి నాయకులంతా కృషి చేస్తాం. -ఎం.ఎం.కొండయ్య, చీరాల టీడీపీ ఇన్‌ఛార్జి