ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 1:45 PM IST

ETV Bharat / videos

బాబ్లీ ప్రాజెక్ట్ ధర్నా కేసులో బిలోలి కోర్టుకు దేవినేని ఉమ, నక్కా ఆనంద్‌బాబు

TDP Devineni Uma Nakka Anand babu Attended Biloli Court: బాబ్లీ ప్రాజెక్ట్ ధర్నా కేసులో మాజీ మంత్రులు దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు మహారాష్ట్ర బిలోలి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణకు 2024 మార్చి 14వ తేదీ బిలోలి కోర్టుకు హాజరుకావాలని 2010లోనే ఉమా, ఆనందబాబుకు సమన్లు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఉమా, ఆనందబాబు కోర్టుకు హాజరయ్యారు. 2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ న్యాయస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా 16 మందికి నోటీసులు ఇచ్చింది.

మరోవైపు ఇదే కేసులో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నాందేడ్‌ జిల్లా బిలోలి కోర్టును బుధవారం హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కి గోదావరి జలాల నుంచి రావాల్సిన వాటా కోసం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యేలు బాబ్లీ ప్రాజెక్టు వద్ద ధర్నా చేపట్టారు. చంద్రబాబుతో పాటు మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ప్రస్తుత తెలంగాణలోని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు (కాంగ్రెస్‌), కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ (బీఆర్​ఎస్), రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ (బీఆర్​ఎస్), మాజీ ఎమ్మెల్యేలు హన్మంతుషిండే, కేఎస్‌ రత్నం బుధవారం విచారణకు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details