సోమశిల ఉత్తర కాలువకు గండి కొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు - ఆందోళనలో స్థానికులు - Somasila North Canal Breached - SOMASILA NORTH CANAL BREACHED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2024, 7:31 PM IST
Somasila North Canal Gandi : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఖాన్‌సాహెబ్‌పేట వద్ద ఉత్తర కాలువకు ప్రమాదం పొంచి ఉంది. సోమశిల జలాశయం నుంచి గురువారం నాడు మంత్రి ఆనం నారాయణరెడ్డి ఉత్తర కాలువ మీదుగా రాళ్లపాడు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆ కాలువ రివిట్మెంట్ను డ్రిల్లర్లతో గండి కొట్టి పైపుల ద్వారా పంట పొలాల్లోకి నీటిని మళ్లీంచేందుకు యత్నించారు. కానీ ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో దానిని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలికంగా గండిని మట్టితో పూడ్చి అక్కడి నుంచి వారు జారుకున్నారు.
మరోవైపు ఉత్తర కాలువకు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గండి తెగి నీరంతా బయటకు వస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని బిక్కుబిక్కుమంటున్నారు. కాలువ పక్కన ఉన్న తమ పంట పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. కాలువకు గండి కొట్టిన వారిని కఠిన శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయంపై స్పందించి అధికారులు దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.