ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మరోసారి పెద్ద మనసును చాటుకున్న చంద్రబాబు- చేనేత ఆత్మహత్య కుటుంబానికి అన్నీ తానై ఉంటానని భరోసా - CBN Support to suicide Family - CBN SUPPORT TO SUICIDE FAMILY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 10:41 PM IST

Chandrababu Naidu Support to  Handloom Suicide Family : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. వైఎస్సార్సీపీ భూదాహానికి కుటుంబాన్ని కోల్పోయిన ఓ బాధితురాలి భవిష్యత్తుకు భరోసాగా కల్పించారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో సుబ్బారావు భార్య, చిన్న కుమార్తెతో ఆత్మహత్య చేసుకోవండంతో ఆయన పెద్ద కుమార్తె నిత్య లక్ష్మీ ప్రసన్న ఒంటరి అయిపోయారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ నేతలు నిత్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. 

చంద్రబాబు మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి : అదే సమయంలో నిత్యతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఆమెను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అన్ని రకాలుగా  అండగా ఉంటుందని భరోసా కల్పించారు. చదువుకు అయ్యే ఖర్చు పెట్టుకుని స్థిరపడే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిత్య స్థిరపడే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు, సోదరిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకి చంద్రబాబు మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని నిత్య లక్ష్మీ ప్రసన్న తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details