
"అభివృధ్ధి, సంక్షేమ విజనరీ మన చంద్రన్న" - టి.డి.జనార్దన్ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు - Chandrababu Book Launch - CHANDRABABU BOOK LAUNCH

By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 8:03 PM IST
TDP Chief Chandrababu Naidu launched a Book : "అభివృధ్ధి, సంక్షేమ విజనరీ మన చంద్రన్న" పుస్తకాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. తెలుగు ప్రజల అభివృద్ధికి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో చేసిన కృషిని వివరిస్తూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు టీ.డీ. జనార్దన్ ఈ పుస్తకాన్ని రాశారు. చంద్రబాబు పేరు చెపితే ఏదైనా పథకం గుర్తొస్తుందా అని చౌకబారుగా విమర్శలు చేస్తున్న వారికి ఈ పుస్తకం తగిన సమాధానమని జనార్దన్ అన్నారు. దార్శనికుడైన పాలకుడు అధికారంలో అంటే జరిగే మేలు ఏంటో ప్రజలకు మరోసారి గుర్తు చేసేందుకే పుస్తక రూపంలో తీసుకొచ్చామని వివరించారు.
అలాగే చంద్రబాబు నాయుడు తన జీవితాన్ని రాష్ట్రం కోసం అంకితం చేసిన విషయాలను వెల్లడించానని తెలిపారు.
తెలుగు ప్రజలు పేదరికాన్ని వీడి ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు చంద్రబాబు తీసుకున్న చర్యలు గుర్తుచేశానని జనార్దన్ తెలిపారు. అలాగే సంక్షేమంతో అభివృద్ది జరగాలి, ఆ అభివృద్ది సంక్షేమం కోసమై ఉండాలి అనే విధంగా సాగిన చంద్రబాబు పాలనలోని విషయాలను అంశాల వారీగా క్లుప్తంగా వెల్లడించానని తెలిపారు. ఒక విజనరీతో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు ఆలోచనలను ఈ పుస్తకంలో పోందుపరిచానని జనార్దన్ పేర్కొన్నారు. అలాగే విమర్శకుల నోళ్లు మూతపడేలా టీ.డీ. జనార్దన్ ఈ పుస్తకాన్ని రాశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.