ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: పత్తికొండలో చంద్రబాబు 'రా కదలిరా' బహిరంగ సభ - TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 12:10 PM IST

Updated : Jan 28, 2024, 6:17 PM IST

TDP Chandrababu Raa Kadali ra Public Meeting: రా కదలిరా' కార్యక్రమంలో భాగంగా నేడు నెల్లూరు, పత్తికొండలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. 'రా కదలిరా' బహిరంగ సభల్లో పాల్గొంటారు. తొలుత ఉరవకొండ నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకోనున్నారు. అనంతరం నెల్లూరు నుంచి పత్తికొండలోని బహిరంగ సభకి వెళ్లనున్నారు. 

దీంతో ‘రా.. కదలిరా’ సభల నిర్వహణకు టీడీపీ, జనసేనలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరుకు చేరుకున్నారు. నగరంలోని ఎస్‌వీజీఎస్‌ మైదానంలో జరిగే బహిరంగ సభ వేదికగా చంద్రబాబునాయుడు గత నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం, అరాచకాలు, దాడులు, వైఫల్యాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కనివినీ ఎరుగని రీతిలో ‘రా.. కదలిరా’ సభ విజయవంతం చేసేలా నెల్లూరులో ఏర్పాట్లు చేశారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. నెల్లూరులో సభ ముగిసిన అనంతరం చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగే సభలో పాల్గొంటారు.

Last Updated : Jan 28, 2024, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details