ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పోస్టల్ బ్యాలెట్‌ అంటే వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు?: అశోక్‌బాబు - TDP Ashok Babu on YSRCP - TDP ASHOK BABU ON YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 3:12 PM IST

TDP Ashok Babu Comments on YSRCP About Postal Ballot Issue : పోస్టల్ బ్యాలెట్ అంటే వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఏపీ పోస్టల్‌ బ్యాలెట్ వివరణపై వైఎస్సార్సీపీ మోసపూరిత ప్రకటన చేసిందని మండిపడ్డారు. హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్​పై వేసిన అప్పీల్​లో వైఎస్సార్సీపీ తోక ముడిచిందని ఎద్దేవా చేశారు. తాము ఓడిపోయినా నిసిగ్గుగా ఎలక్షన్ కమిషన్​పై విషం కక్కుతుందని ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను యథాతథంగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలపై తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. 

పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్సార్సీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై అధికారుల సంతకం ఉండి సీలు, స్టాంపు లేకపోయినా వాటిని తిరస్కరించకుండా లెక్కించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ గతంలో సర్క్యులర్ జారీ చేశారని వివరించారు. ఈసీ ఎదో సడలింపులు ఇచ్చిందని, దీనివల్ల అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్ధమన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఉక్రోషంతో ఇటువంటి లిటిగేషన్స్ తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 4వ తేదీన తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details