ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సింహాద్రి అప్పన్న ఆలయంలో ఘనంగా స్వాతీ నక్షత్ర హోమం- పోటెత్తిన భక్తులు - Swathi Nakshatram Homam - SWATHI NAKSHATRAM HOMAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 2:13 PM IST

Swathi Nakshatram Homam at Simhachalam Temple: విశాఖ జిల్లా సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర హోమం ఘనంగా జరిగింది. సర్వాభరణాలతో గోవిందరాజు స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్​ను వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదాన్ని అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వాతి నక్షత్ర హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 

యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహాద్రినాథుడిని దర్శించుకుని సేవించుకున్నారు. దంపతులు 2,500 రూపాయలు చెల్లించి ఈ ఆర్జిత సేవలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ఈ వేడుకలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లపై హోమానికి విచ్చేసిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details