ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తూరు జిల్లాలో వైభవంగా ఆడికృత్తిక ఉత్సవం - ఆకట్టుకున్న మురుగన్ భక్తుల విన్యాసాలు - Subramanya Swamy Festival

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 5:51 PM IST

SUBRAMANYA SWAMY FESTIVAL (ETV Bharat)

Subramanya Swamy Festival Celebrated in Chittoor District : చిత్తూరు జిల్లాలోని త్రిరాష్ట్ర కూడలి గుడుపల్లె మండలం గుడివంకలో ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి కావళ్లు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హరోం హర మురగయ్య అనే నామస్మరణలతో గుడివంక ప్రాంగణమంతా మార్మోగింది. తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కావడి మొక్కుల చెల్లింపులో మురుగన్ భక్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.  

స్వామి అమ్మవార్లకు తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించిన ప్రధాన అర్చకులు వీరశేఖరయ్య ప్రత్యేక అలంకరణలు చేశారు. ముందుగానే గుడివంక చేరుకున్న భక్తులకు ఉదయం నుంచే స్వామి దర్శనం కల్పించారు. పాలకావడి, తేరుకావడి, నెమలి కావళ్లతో పాటు నోటికి, వీపునకు ఇనుప శూలం గుచ్చుకుని పంబు వాయిద్యాలు, భక్తి పాటలతో భక్తులు గుడివంక మీదుగా వేపమాను కొండెక్కి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు. భక్తుల విన్యాసాలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం కొండపైకి తరలిరావడంతో ఆలయం ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details