తెలంగాణ

telangana

ETV Bharat / videos

నీట్ అవకతవకలపై విద్యార్థి సంఘాల నిరసన ర్యాలీ - వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ - Students Union leaders protest

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 1:09 PM IST

Students Union leaders protest  On NEET Irregularities : నీట్ సమస్యల పరిష్కారానికై ఎన్.ఎస్.యు.ఐ, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు హైదరాబాద్​లో 'స్టూడెంట్ మార్చ్' నిర్వహించాయి. హిమాయత్ నగర్ కూడలి నుంచి ట్యాంక్​బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. నీట్ అవకతవకలపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. 

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారితంగా వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించాలని కోరారు. ఈ పరీక్షలో ప్రశ్నాపత్నం లీక్ అయ్యిందా? లేక మాస్ కాపీయింగ్ జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విచ్చలవిడిగా మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇస్తుందని, దీని వల్ల తక్కువ ర్యాంక్ వచ్చిన వారికీ మెడిసిన్ సీట్లు వస్తున్నాయని వారు ఆరోపించారు. నీట్ డైరెక్టర్ జనరల్ సుబోధ్​ను తక్షణమే విధుల నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details