ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'హామీని నిలబెట్టుకోండి'- ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల వేడుకోలు - Students Plead to Appoint Teacher - STUDENTS PLEAD TO APPOINT TEACHER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 6:01 PM IST

Students Plead to Appoint Teacher: పాఠశాల షెడ్డును నిర్మించుకుంటే ఉపాధ్యాయుడ్ని నియమిస్తామని అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అల్లూరి జిల్లా తెంగిల్‌ బంద గ్రామ విద్యార్థులు కోరుతున్నారు. అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ టెన్గిల్ బంద గ్రామంలో సుమారు 20 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరందరూ పక్క గ్రామం గంగవరానికి వాగు దాటుకుంటూ రోజూ కాలినడకన వెళ్లి అక్కడి పాఠశాలలో చదువుకుంటున్నారు. విద్యార్థులు చదువుకునేందుకు నిత్యం వాగు దాటాల్సి వస్తోంది.  

వాగు దాటడం ప్రమాదకరంగా ఉండడంతో ఇటీవల అల్లూరి జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌కు తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని గ్రామస్థులు విన్నవించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ పాఠశాల నిర్వహణకు వీలుగా ఒక పాకను నిర్మించుకుంటే ఉపాధ్యాయుడిని నియమిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రామస్థులంతా చందాలు వేసుకుని విద్యార్థుల చదువు కోసం రేకుల షెడ్డును నిర్మించుకున్నారు. పిల్లల భవిష్యత్‌కు తాము ముందడుగు వేశామని ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయుడ్ని నియమించాలని జిల్లా కలెక్టర్‌ను తల్లిదండ్రులు, విద్యార్థులు వేడుకుంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details