పాఠశాలలో వైఎస్సార్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం - ఇబ్బందులు పడ్డ విద్యార్థులు - Arogya Suraksha hinder students
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 3:00 PM IST
Students Facing Problems with YSR Arogya Suraksha Program in Kanigiri: పాఠశాలలో విద్యార్థుల చదువుతున్నారనే నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థులకు ఆటంకం కలిగిస్తూ పాఠశాలలో వైఎస్సార్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఓ పక్క పాఠశాల జరుగుతుంటే మరో వైపు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తూ ఉండటంతో అక్కడ చదువుతున్న విద్యార్థులు పలు ఇబ్బందులకు గురయ్యారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య సురక్ష శిబిరం జరుగుతుందనే సమాచారం లేకపోవడంతో స్థానికులు వైద్యం కోసం శిబిరానికి ఏ ఒక్కరూ రాకపోవడం గమనార్హం. దీంతో వైద్యులు, ఆశా కార్యకర్తలే తప్ప మచ్చుకైనా రోగులు కనిపించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆరోగ్య సురక్ష శిబిరం ఫలితంగా ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేయడమే తప్ప ఎవరికి ఉపయోగపడే పరిస్థితి లేదని స్థానికులు మండిపడుతున్నారు.